
విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ సర్కార్ తొండిచేస్తోందని, తెలంగాణ విద్యుత్ సంస్థలపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు వ్యవహరిస్తోందని టీఎస్ ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. అన్నీ పోను ఏపీ సర్కారే తమకు రూ. 2,406 కోట్లు బాకీ ఉందని, కానీ తామే వాళ్లకు బకాయి ఉన్నట్లు బుకాయిస్తున్నారని మండిపడ్డారు . ‘వాళ్లకు మేం ఇచ్చేది డబ్బులు .. వాళ్లు మాకివ్ వాల్సిం ది డబ్బులు కావా..? ఆరోపణలు చేసే ముందు ఆలోచించి, రిపోర్టును సరిచూసుకొని మాట్లాడితే బాగుండేది’ అని అన్నారు .
శుక్రవారం ఆయన విద్యు త్ సౌధలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యు త్ సంస్థల విషయంలో ఎన్ని ఉత్తరాలు రాసినా సెటిల్‌మెంట్ చేసుకోకుండా లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడం వెనుక ఏపీ జెన్‌కో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ జెన్‌కో నుంచి టీఎస్ జెన్‌కోకు రూ. 3,096 కోట్లు రావాలని, ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ. 1659 కోట్లు రావాలని తెలిపారు. మొత్తంగా తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.5,785 కోట్లు అని ఆయన చెప్పారు . కానీ, తెలంగాణనే రూ. 5,600 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏపీ చెబుతోందని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సింది రూ. 3379 కోట్లేనని, తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన రూ. 5,285 కోట్ల నుం చి వాటిని తీసేస్తే.. అన్నీపోను తెలంగాణకే
ఏపీ రూ. 2,406 కోట్లు బాకీ ఉంటుందని ఆయన వివరించారు. ‘మాచ్ ఖండ్ నుం చి తెలంగాణకు రావాల్సి న విద్యుత్ ఇవ్వడం లేదు. లెక్కలు తేలాక ఒక్క రూపాయి ఇవ్వాల్సి ఉన్నా ఇచ్చేస్తాం. మనం ఇక్కడ సమస్యలు పరిష్కరిం చుకోలేకపోతే ఎన్‌సీఎల్టీకి పోవాలి. మేము చెబుతున్నా పట్టించుకోకుండా ఏపీ విద్యు త్ సంస్థలు ఎన్‌సీఎల్టీకి వెళ్లాయి. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఏపీ విద్యుత్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. ఏపీ విద్యుత్ సంస్థలు ముందుకు వస్తే 24 గంటల్లో సమస్యల పరిష్కారానికి మేము సిద్ధం’ అని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
ఏపీలో విద్యుత్ సంస్థలకు, అక్కడి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడినట్లుందని అన్నారు. సెటిల్ చేసుకోవడానికి తాము రెడీగా ఉన్నామని, ఏపీ వాళ్లు సెటిల్ చేసుకునే పరిస్థితిలో లేరని, ఉంటే ఎన్సీఎల్టీకి వెళ్లేవారు కాదని ఆయన పేర్కొన్నారు . 619 మంది ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉండి ఆప్షన్ ఇచ్చినా తీసుకోకుండా .. ప్రతి దాంట్లో తెలంగాణపై అలిగేషన్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు . ‘ఏపీ చెప్పేది పూర్తి అవాస్తవం, టెల్ పాండ్ ఉద్యోగు ల విషయం, తుంగభద్ర పవర్ ప్లాం ట్ విషయంలో తేల్చుకుందాం . రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపెడుతూనే ఉన్నారు . అనంతపురం, కర్నూలుకు రూ.1600 కోట్లు కట్ట ాం. ఏదైనా వివాదాలుం టే ఈఆర్సీకి ఫిర్యాదు చెయ్యాలన్నారు. కంట్రోలర్ అడిటర్ జనరల్ రెండు రాష్ట్రాలకు ఒక్కటే. మేం తప్పుడు లెక్కలు చేస్తే తేలవా? అసత్యప్రచారం జరుగుతోంది’ అని అన్నారు . రాష్ట్రంలో ఇప్పటికే 10500 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ ఉందని, గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఈ వేసవిలో 11000 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని, అంతా పారదర్శకంగా విద్యు త్ కొనుగోళ్లు చేస్తున్నామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే కరెంట్ కొనాల్సిందేనని చెప్పారు . ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలను ఆయన వివరించారు.