
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అంటూ అగ్ని సాక్షిగా, ప్రమాణ పూర్వకంగా జరిగిన పెళ్లిల్లు.. చాలా ఈజీగా పెటాకులవుతున్నాయి. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే బతికినంత వరకు తోడు నీడా ఒక్కరే అనే నిజాన్ని మరిచి.. మరొకరి మోజులో పడి.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భర్తలను చంపుకుంటున్నారు కొందరు భార్యలు. కొన్నిసార్లు భార్యలను కూడా భర్తలను చంపుతున్నారు. ఈ మధ్య ఈ ధోరణి ఎక్కువైపోయింది. ఒక క్రైమ్ సీరీస్ నడుస్తున్నట్లుగా ఎక్కడో ఒక చోట చాలా చిత్రవిచిత్రమైన ప్రాన్ లతో కడతేర్చుతున్నారు.
మొన్నటికి మొన్న నిద్రమాత్రలిచ్చి భర్తను హత్య చేయాలని ప్రయత్నించింది ఓ ఉత్తమ ఇల్లాలు. అయినా చావలేదని లవర్ కోసం.. కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. అలాంటి స్టోరీనే మరొకటి తమిళనాడులో జరిగింది. లవర్ మోజులో పడి పిల్లలు ఉన్న సంగతి మరిచి.. భర్తను చంపేందుకు పెద్ద పెద్ద ప్లాన్లే వేసింది. కానీ మొండి ప్రాణం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికి బట్టకట్టాడు ఆ భర్త. దీంతో లవర్ తో కలసి వేసిన ఫైనల్ స్కెచ్ లో అనుకున్నది సాధించింది.. ఆ అమాయక భర్తను చంపేసింది ఈ మహాతల్లి.
తమిళనాడులోని ధర్మపురిలో రసూల్, అమ్ముబీ అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అనే పార్టీలో స్థానిక నాయకునిగా చురుకుగా పనిచేస్తుంటాడు. అయితే భర్త రాజకీయాల్లో బిజీబిజీగా ఉండగా.. అమ్ముబీ ఆలూర్ ఏరియాలో సెలూన్ నడుపుకునే లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ALSO READ : ఓ భార్య కథ : దుబాయ్‌లో భర్త చేతిలో చనిపోయిన అతుల్య.. కొత్త ఉద్యోగంతో వేధింపులు తగ్గుతాయ్ అనుకుంది కానీ..!
వీడియో కాల్ చేస్తూ దొరికిపోయిన భార్య:
వాళ్లిద్దరి మధ్య ఉన్న అఫైర్ గురించి రసూల్ కు వీడియో కాల్ ద్వారా తెలిసిపోయింది. ఒకరోజు భార్య వీడియో కాల్ మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రసూల్.. లోకేశ్వరన్ ను ఫోన్ చేసి ఇంటికి పిలిపించి ఇద్దరికీ నాలుగు తగిలించి భయపెట్టాడు. దీంతో మనసులో పెట్టుకున్న ఇద్దరూ.. రసూల్ ను లేపేస్తే ఓ పనైపోతుందనే నిర్ణయానికి వచ్చారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రసూల్ ను తినే ఆహారంలో విషం పెట్టి చంపాలని డిసైడ్ అయ్యారు. పథకం ప్రకారం ఒకటి కాదు రెండు కాదు.. ఐదు సార్లు సాంబార్లో విషం పెట్టింది భార్య. కానీ మొండోడు.. ప్రతిసారి ఏదో ఒకలాగ బతికి బయటపడ్డాడు. అనారోగ్యం అనుకుని ఆస్పత్రిలో చూపించుకుని బతికాడు. ఇక లాభం లేదనుకుని.. దానిమ్మ జూస్ లో ఎక్కువ మొత్తంలో పురుగుల మందు కలిపారు. తాగిన వెంటనే కుప్పకూలిపోయిన రసూల్.. రక్తం కక్కుకున్నాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే విషం శరీరం అంతా పాకి చనిపోయాడు.
ఫోన్ లో బయటపడిన భయంకరమైన ఆడియో మెస్సేజ్:
రసూల్ చనిపోయిన తర్వాత అతని మరదలు.. ఆయన ఫోన్ చెక్ చేయగా కొన్ని ఆడియో మెసేజ్ లు దొరికాయి. అందులో లోకేశ్వరం అమ్ముబీకి మందు ఎలా కలపాలో ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నఆడియో విని షాకైంది. ఈ ఆడియోలో లోకేశ్వరం ఈ విధంగా చెప్పాడు.. నేను ఇచ్చిన మెడిసిన్ జ్యూస్ లో కలుపు. బాగా డార్క్ బ్రౌన్ కలర్ వస్తే దాన్ని పడేసెయ్. లైట్ కలర్ ఉంటే ఫిల్టర్ చేసి తాగడానికి ఇచ్చేసెయ్.. అంటూ సూచించాడు.
మరో వాయిస్ మెసేజ్ లో అమ్ముబీ మాట్లాడుతూ.. జూస్ తాగాడు.. కింద పడి గిలగిల కొట్టుకుంటున్నడు.. కాసేపు ఉంటే పోతాడు.. అంటూ లవర్ లోకేశ్వరంకు మెసేజ్ పంపింది.
అయితే దర్యాప్తులో లోకేశ్వరం చెస్ట్ పైన అమ్మూబీ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరి మధ్య ఉన్న వ్యవహారానికి మరింత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికినట్లైంది. ఈ ఘటనలో మర్డర్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.