Saiyaara : ఇదేం పిచ్చిరా నాయనా..? ‌'సైయారా' కోసం సెలైన్‌తోనే థియేటర్‌కు వచ్చిన అభిమాని.!

Saiyaara : ఇదేం పిచ్చిరా నాయనా..? ‌'సైయారా' కోసం సెలైన్‌తోనే థియేటర్‌కు వచ్చిన అభిమాని.!

అహాన్ పాండే ( Ahaan Panday ) , అనీత్ పడ్డా ( Aneet Padda )నటించిన చిత్రం సైయారా ( Saiyaara Move ).  మోహిత్ సూరి ( Mohit Suri )దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది.  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగాల సుడిగుండంలో ముంచెత్తుతుంది. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటే... మరికొందరు ఆనందంతో థియేటర్లలోనే నృత్యం చేస్తున్నారు.  ఇంకొందరి అభిమానం అయితే పీక్స్ కు  వెళ్లింది.  ఈ నాటకీయ స్పందనలు సినిమా చూడని వారిలో కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. 
 
సెలైన్ తో వచ్చి సినిమా చూసిన అభిమాని!
థియేటర్లలో సైయారా మూవీ సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతాకాదు.  అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉంది.  కొన్ని  వీడియోలు చూస్తే అభిమానం హద్దులు దాటిందా అన్న విధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి తన చేతికి సలైన్ కట్టుకుని మరి సినిమా చూస్తూ కనిపించాడు. అతను అత్యంత భావోద్వేగానికి లోనై , పక్కనే ఉన్న సలైన్ స్టాండ్ ను గట్టిగా పట్టుకుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  కొందరు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ... ఆ వ్యక్తి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని విమర్శించగా.. మరికొందరు ఈ సినిమాపై ఇంతటి హైప్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Iamfaisal (@iamfaisal04)

మరొక వీడియో క్లిప్ లో మహిళలు థియేటర్ లో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.  మరికొందరు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొందరు స్పృహ కోల్పోగా.. ఇంకొందరు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ ఊగిపోయారు.  తమ అభిమానాన్ని చాటుకుంటూ.. ఈలలతో థియేటర్లు దద్దరిల్లేలా ఆరుపులు , కేకలు వేస్తూ చిందులు వేస్తున్నారు. ఇలా అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలు సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి.

అంచనాలకు మించిన కంటెంట్
 సినిమా చూసిన వారు ప్రేక్షకులు తమ అనుభవాలను ఈ సోషల్ ఫోరమ్‌లో పంచుకుంటున్నారు. ఒక రెడిటర్ ఇప్పుడే సినిమా చూశాను, నిజం చెప్పాలంటే కథ చాలా బాగుంది ,  నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు, ఇది మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది అని వ్యాఖ్యానించారు.  సినిమాలో పాటలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు గూస్‌బంప్స్ వచ్చాయి , పిచ్చిగా ఏడ్చాను అంటూ  మరొకరు  పంచుకున్నారు.   థియేటర్‌లో జనం ఈలలు వేస్తూ, అరుస్తూ ఉన్నారు. కంటెంట్ అంచనాలను మించినప్పుడు ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తారని  అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా, 'సైయారా' ఒక రొమాంటిక్ డ్రామా కావడంతో, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మోహిత్ సూరి తన మార్క్‌ను మరోసారి చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అహాన్‌ పాండే, అనీత్ పడ్డా తమ తొలి సినిమాతోనే ఇంతటి ప్రభావాన్ని చూపడం వారి భవిష్యత్తుకు శుభసూచకమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తొలి రోజు దాదాపు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 21 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ85 కోట్లను అధిగమిస్తుందని అభిమానులు, మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.  మరి బాక్సాఫీస్ వద్ద వారి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి మరి.