తిరుమల ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి హల్ చల్...

తిరుమల ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి హల్ చల్...

తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ఎలుగుబంటి హల చల్ చేసింది. ఆదివారం ( జులై 20 ) తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న వినాయక స్వామి గుడి పక్కన  రోడ్డుపైకి వచ్చింది ఎలుగుబంటి. తిరుమల నుండి తిరుపతి వస్తున్న వాహనదారులు ఎలుగుబంటిని గమనించి.. ఎలుగుబంటి దృశ్యాలను సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. ఎలుగుబంటి సంచారంపై విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు వాహనదారులు.

ఘాట్ రోడ్డు పక్కనే స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించింది ఎలుగుబంటి. అటుగా వెళుతున్న వాహనదారులు ఈ దృశ్యాలను సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఎలుగుబంటి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు వాహనదారులు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని సురక్షితంగా అటవీప్రాంతంలోకి తరలించారు.