శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం

శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం

శ్రీకాకుళంలో  కోడి రామమూర్తి స్టేడియం(కేఆర్ స్టేడియం) అభివృద్దికి నిధులు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. స్టేడియంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతు లు, సౌకర్యాల కల్పించేందుకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది.ఈ నిధులతో స్టేడియం చుట్టూ కాంపౌండ్ వాల్, రన్నింగ్ ట్రాక్, క్రికెట్ పిచ్, ఇండోర్ స్టేడియంలు నిర్మించనున్నారు.

పదేళ్ల క్రితం కేఆర్‌ స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టగా ఆ తర్వాత రోజుల్లో ఉన్న గోడ, సిట్టింగ్‌ బెంచీలు, ఇతర సౌకర్యాలను తొలగించారు. తొలుత రూ.10 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రతిపాదించగా జాప్యం కారణంగా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు పెంచారు. ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం స్టేడియంలో పలు అభివృద్ధి పనులకు రూ.12 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు మంజూరు చేసింది.