
ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవలే సీనియర్ IAS అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధిపతులను మార్చిన సర్కార్ శనివారం ( సెప్టెంబర్ 20 ) మరో తొమ్మిది మంది IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే :
- ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ
- ఆర్ అండ్ బీ డైరెక్టర్‌గా ప్రశాంతి
- ఎక్సైజ్ డైరెక్టర్‌గా శ్రీధర్
- సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్
- స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ ఐజీగా అంబేద్కర్
- కృష్ణా జిల్లా జేసీగా నవీన్
- ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం
- నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు
- ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రబుత్వం.