ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బిశ్వభూషణ్‌కు భార్య సుప్రవ హరిచందన్, కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ ఉన్నారు.ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది.
1971లో ఆయన భారతీయ జన సంఘ్‌లో చేరారు. అక్కడ్నుంచి రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు.
