V6 News

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత

అమరావతి: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25)  తెల్లవారుజామున విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నామని.. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి గవర్నర్ హెల్త్ కండిషన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. 

షెడ్యూల్ ప్రకారం ఇవాళ (ఏప్రిల్ 25) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆమె చేత ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ అబ్ధుల్ నజీర్ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలుకావడంతో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సందిగ్ధం నెలకొంది.