అమరావతిపై FB పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌పై.. ఏపీ ప్రభుత్వం వేటు

అమరావతిపై FB పోస్ట్.. జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌పై.. ఏపీ ప్రభుత్వం వేటు

తిరుపతి: తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుభాష్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్‌ తన ఫేస్‌బుక్‌లో ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు దుమారం రేపాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆయనను వివరణ కోరింది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు.

ఆయన సమాధానం పట్ల సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ నుంచి ఆయనను తొలగించింది. రాజధాని అమరావతిపై వివాదాస్పద పోస్టులు పెట్టారనే కారణంగా ప్రభుత్వం సుభాష్‌పై చర్యలు తీసుకుంది.