AP News: పీఎస్సార్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్

AP News: పీఎస్సార్ ఆంజనేయులకు మధ్యంతర  బెయిల్

ముంబయి నటి జత్వాని కేసులో... ఏపీపీఎస్సీ  గ్రూప్- 1 మూల్యాంకనం అక్రమాల కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి..గత ప్రభుత్వంలో  ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు ఏపీ హైకోర్టులో ఊరట కలిగింది.  అనారోగ్య కారణాలతో పీఎస్సార్​కు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్​  మంజూరు చేసింది. ఈ నెల 26న తిరిగి మళ్లీ జైలుకు సరెండర్​  కావాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

. కోర్టు ఆయనకు తొలుత రిమాండ్ విధించింది . తరువాత  పలుమార్లు పోలీసు కస్టడీకి అప్పగించింది.  బీపీలో హెచ్చుతగ్గులతో సతమతమైన పీఎస్సార్ పలుమార్లు జైలు నుంచే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ప్రస్తుతం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అదే సమయంలో తన ఆరోగ్య పరిస్థితి చూసి అయినా బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ALSO READ | Good News : జూన్ 12న.. తల్లుల ఖాతాల్లో డబ్బులు.. ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున.. ఎంత మంది పిల్లలుంటే అన్ని 15 వేలు..!

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు… పీఎస్సార్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోగ్య నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలంటూ బెజవాడ ప్రభుత్వ వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీఎస్సార్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బుధవారం  ( జూన్​ 11) ..  మెడికల్ రిపోర్టులను కోర్టుకు అందజేశారు. ఈ రిపోర్టులను పరిశీలించిన కోర్టు పీఎస్సార్ నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నారని భావించిన 14 రోజుల వ్యవధితో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

గత ప్రభుత్వంలో ఏపీ ఇంటిలిజెన్స్​ చీఫ్​ గా పనిచేసిన పీఎస్సార్​ ఆంజనేయులను ఏపీ పోలీసులు  
హైదరాబాద్​  బేగంపేటలోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం (ఏప్రిల్‌ 22)ఆయనను అదుపులోకి తీసుకొని అనంతరం విజయవాడ తరలించారు.  ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు.