వివాదంలో బిగ్ బాస్.. హోస్ట్ నాగార్జునకు నోటీసులు

వివాదంలో బిగ్ బాస్.. హోస్ట్ నాగార్జునకు నోటీసులు

ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్(Bigg boss) షోకి.. తెలుగులో కూడా మంచి ఆదరణే లభించింది. ఇప్పటికే విజయవంతంగా ఆర్ సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. తాజాగా ఏడవ సీజన్ కోసం సిద్ధమైంది. ఈ కొత్త సీజన్ కు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోను ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

అయితే తాజాగా తెలుగు బిగ్ బాస్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. సీపీఐ నాయకుడు నారాయణ(CPI Narayana) గతంలోనే చాలాసార్లు బిగ్ బాస్ కౌంటర్స్ వేసిన విషయం తెలిసిందే. ఈ షో పిల్లలు, యువతపై ప్రభావం చూపిస్తుందని, కంటెస్టెంట్స్ మధ్య అశ్లీలత, అసభ్యత సీన్స్ కూడా ఎక్కువయ్యాయని పిటీషన్ వేశారు నారాయణ. దీంతో ఈ షోను నిలిపేయాలంటూ హైకోర్టు(High court) కూడా తీర్పు ఇచ్చిన విషయం కూడా విదితమే.

తాజాగా ఈ కేసుపై విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. ఇందులో భాగంగా.. హోస్ట్ నాగార్జున(Nagarjuna)తోపాటు, ఛానెల్ కు నోటీసులు జారీచేసింది. అంతేకాదు.. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మరి ఇన్ని ఆటంకాల మధ్య బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.