కానిస్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా జితేందర్ రెడ్డి ఏకగ్రీవం

కానిస్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా జితేందర్ రెడ్డి ఏకగ్రీవం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జితేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ పదవిలో ఐదేండ్ల పాటు ఆయన కొనసాగనున్నారు.

 ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుడూ.. ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, క్లబ్‌‌‌‌‌‌‌‌ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తాననన్నారు. కాగా, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు.