మూడు గురించి మాట్లాడే అర్హత పవన్‭కు ఉందా? : అంబటి రాంబాబు

మూడు గురించి మాట్లాడే అర్హత పవన్‭కు ఉందా? : అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతికత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‭కు ఉందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘మూడు ముక్కల ముఖ్యమంత్రి అని జగన్‭ పై పవన్ విమర్శలు చేస్తున్నారు. అసలు మూడు, మూడుముళ్ల గురించి మాట్లాడే అర్హత పవన్‭కు ఉందా..?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో యువకులను చెడగొట్టడానికి, చంద్రబాబుకు ఆపద వస్తే కాపాడటానికే పవన్ జనసేన పార్టీ పెట్టారని విమర్శించారు. మైకు దొరికితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కు ఆరాటం తప్ప పోరాటమే లేదన్నారు. పవన్‌ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీ అని, తగిన ప్యాకేజీ అందితే పొత్తుకు సిద్ధమని పవన్‌ మరోసారి చెప్పాడని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబుతో పవన్‌ ఏం మాట్లాడాడో తమకు తెలుసన్నారు. పవన్‌ వెళ్తున్న మార్గం మంచిది కాదని, యువత ఈ విషయాన్ని గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.