ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. బ్రో మూవీ కలెక్షన్స్పై అంబటి పంచులు

ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. బ్రో మూవీ కలెక్షన్స్పై అంబటి పంచులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటించిన బ్రో(Bro) సినిమా కలెక్షన్స్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పంచులతో రెచ్చిపోయారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చినా ఎందుకో కలెక్షన్స్ మాత్రం అంతగా రావడం లేదు. మొదటి రోజు దాదాపు రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది బ్రో మూవీ. అయితే తరువాత రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ అనూహ్యంగా తగ్గిపోయాయి. 

రెండోరోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు వసూళ్లు రాబట్టిన బ్రో మూవీ..  నాలుగవ రోజు కేవలం రూ. 5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఇదే విషయంపై తాజాగా స్పందించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అంబటి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.