
ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల నిరసన చూసి బిల్లును వెనక్కి తీసుకోవడం లేదన్నారు. అమరావతిలో నిరసనలు చేస్తోంది పెయిడ్ అర్టిస్టులు మాత్రమే అన్నారు. ఆ పాదయాత్రలు, నిరసనలు టీడీపీ చేయిస్తున్నవే అని పెద్ది రెడ్డి ఆరోపించారు. ఇది కేవలం ఇంట్రవెల్ మాత్రమే అన్నారు.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి పెద్ది రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతోనే బిల్లు వెనక్కి తీసుకొని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లీగల్‌గా ఏమైనా తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుతారని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇవాళ కోర్టులో రాజధాని అంశంపై వాదోపవాదాలు జరిగాయి. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలన్న ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని మాతో అరగంటలో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందన్న అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.