హైదరాబాద్, వెలుగు: ఏపీలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు చిక్కాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి నానక్‌రామ్‌గూడలో కొంత మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్టు ఈగల్ ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో నానక్‌రాంగూడ పరిసర ప్రాంతాల్లో శనివారం పోలీసులు నిఘా పెట్టారు.
ఓ గంజాయి సప్లయర్ వద్దకు కారులో వచ్చిన వ్యక్తి గంజాయి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కారును వెంబడించి.. 16 ఎక్తా విల్లాలోకి వెళ్లినట్టు గుర్తించి.. సోదాలు నిర్వహించారు. విల్లాలో ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఉన్నారు. వారికి డ్రగ్ కిట్ తో టెస్టులు చేశారు. పాజిటివ్‌గా తేలడంతో వారిని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
