ఏపీ ప్రభుత్వం ప్రేక్షకుల్ని అవమానించింది

ఏపీ ప్రభుత్వం  ప్రేక్షకుల్ని అవమానించింది

ఏపీలో టికెట్ ధరలపై నేచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందన్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడిన కూడా వివాదం అవుతుందన్నారు నాని. ధరలు పెంచినా టికెట్ కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు. టూర్ కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే అన్నారు నాని. నా పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దామనుకుంటున్నా అన్నారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యమన్నారు. మా  లెక్కలు తర్వాత చూసుకుందామన్నారు. శ్యాం సింగరాయ్ టీంతో కలిసి ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు సాయిపల్లవి, కృతిశెట్టి, నాని జంటగా నటిస్తున్న సినిమా శ్యాం సింగరాయ్. ఈ సినిమాను రేపు (డిసెంబర్ 24) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డబుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలై ట్రైలర్‌ చూసి ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు