కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్

కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంలో ఏపీ పిటిషన్

అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్దమైన నీటి వాటాను ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. శ్రీశైలం డ్యామ్ లో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసుండడం వల్ల ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగా విరుద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రజల జీవించే హక్కును తెలంగాణ ప్రభుత్వం హరించేలా వ్యవహరిస్తోందని పిటిషన్ లో పేర్కొంది. విభజన చట్టంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు అమలు చేయడం లేదని.. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలను గాని.. కేంద్రం ఇచ్చే ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది.