ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..

ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ లోని పెంచలకోన సమీపంలోని రావూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. స్మగ్లర్ల నుండి 16ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, కారును స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.టీమ్స్ గా ఏర్పడి  శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రాపూరు వరకు లోడింగ్, డంపింగ్ పాయింట్ల వద్ద తనిఖీ చేపట్టారు పోలీసులు. రాపూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున రెండు వాహనాలు అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తించారు.

అక్కడికి పోలీసులు చేరుకునే సమయానికి ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేస్తుండటంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సాంగ్లర్స్ ను పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు స్మగ్లర్స్ లో తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన ఒకరు, చిత్తూరుకు చెందినవారు ముగ్గురుగా ఉన్నట్లు గుర్తించారు. స్మగ్లర్ల వద్ద నుండి టెంపో,కారుతో పాటు 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.