బండ్ల గణేష్ ను కడపకు తరలించిన పోలీసులు

బండ్ల గణేష్ ను కడపకు తరలించిన పోలీసులు

చెక్ బౌన్స్ అయిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ ను గురువారం కడప కు తరలించారు పోలీసులు. నిర్మాత పీవీపీ ఇంటిపై దాడి కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బండ్ల గణేష్ ను… బంజారాహిల్స్ పోలీసులు పథకం ప్రకారం అరెస్ట్ చేశారు. బండ్ల గణేష్ ఓ సినిమా నిర్మాణంకోసం కడపకు చెందిన మహేష్ అనే వ్యాపారి వద్ద 2011లో రూ.13 కోట్లు తీసుకున్నాడు. ఈ విషయంలో గణేశ్ పై చెక్ బౌన్స్ కేసు ఫైల్ అయింది. స్టేషన్ బెయిల్ కోసం జూబ్లిహిల్స్ పీఎస్ కు వచ్చినప్పుడు ..బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇవాళ బండ్ల గణేష్ ను కడప జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచనున్నారు పోలీసులు.

మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి