
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మార్చి 18 నుంచి ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ,వెస్ట్ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.
ఆయా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు పొలాల్లో ,చెట్ల కింద ఉండకూడదని సూచించింది.