ఏపీలో 10,376 కేసులు నమోదు

ఏపీలో 10,376 కేసులు నమోదు
  • 1,40,993కి చేరిన సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా దాదాపు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 10,376 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. 24 గంటల్లో వ్యాధి బారినపడి 68 మంది చనిపోగా.. చనిపోయిన వారి సంఖ్య 1,349కి చేరింది. ఇప్పటి వరకు 63,864 మంది డిశ్చార్జ్‌ కాగా.. 75,720 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. కరోనాతో గుంటూరులో పదమూడు మంది, అనంతపూర్‌‌లో తొమ్మిది మంది, కర్నూల్‌లో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడప, కృష్ణ, విజయనగరంలో ఒక్కోరు చనిపోయారు. రాష్ట్రంలో 24 గంటల్లో 61,699 శ్యాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటి వరకు 19,51,776 పరీక్షలు జరిపినట్లు అధికారులు చెప్పారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు