తెలంగాణ ప్రాజెక్టులు విభ‌జ‌న చ‌ట్టానికి వ్య‌తిరేకం: ఏపీ స్పెషల్ సీఎస్

తెలంగాణ ప్రాజెక్టులు విభ‌జ‌న చ‌ట్టానికి వ్య‌తిరేకం: ఏపీ స్పెషల్  సీఎస్

తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబి) కి ఏపీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా మిగులు జలాలు ఉన్నాయని, 5 కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చెప్పట్టిందని ఆయ‌న అన్నారు. అపెక్స్ కౌన్సిల్, సిడబ్యుసి, కేఆర్ఎంబి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లు సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరినా, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్ లు సమర్పించలేదని ఫిర్యాదు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం అనుమతి ఇచ్చారనీ కేఆర్ఎంబి కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వారిగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల వివరాలను కేఆర్ఎంబి చైర్మన్ కు ఏపీ అధికారులు అందించారు ఏపీ అధికారులు.

తెలంగాణ ప్రభుత్వం వాటాలకు మించి నీటి వినియోగం,నూతన ప్రాజెక్టుల నిర్మాణం పై కేంద్రానికి, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని వారు ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 881 ఫీట్ దగ్గర మాత్రమే నీటిని తీసుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందనీ, 881 ఫీట్ నీళ్లు సంవత్సరంలో కేవలం 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయనీ ఆదిత్యనాథ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

AP Special CS complaint to KRMB over telangana projects