అప్పట్లో రాయల తెలంగాణకు ఒప్పుకొనుంటే బాగుండేది

అప్పట్లో రాయల తెలంగాణకు ఒప్పుకొనుంటే బాగుండేది

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం వచ్చారు. మాజీ కాంగ్రెస్ నేత అయిన ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. తాను పుట్టింది.. పెరిగింది అంతా కాంగ్రెస్ పార్టీలోనేనని అన్నారు. హుజూరాబాద్ గురించి తనకు తెలియదని, అయితే జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడనేది మాత్రం అందరికీ తెలుసని జేసీ అన్నారు. రాజకీయాలతో పాటు సమాజం కూడా బాగోలేదని అభిప్రాయపడ్డారు. తాను ఆంధ్రా వదిలేసి, తెలంగాణకు వస్తానని జేసీ అన్నారు. తెలంగాణ విడిచిపెట్టి నష్టపోయామమని చెప్పారు. ఆ తర్వాత సీఎంను కలిసిన జేసీ తమకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌‌కు చెప్పానన్నారు. విభజన సమయంలో రాయల తెలంగాణకు ఒప్పుకొనుంటే బాగుండేదని సీఎం కేసీఆర్‌‌కు చెప్పానని  జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

టీడీపీకి పట్టిన గతే టీఆర్‌‌ఎస్‌కూ పడుతది

కిరాణా, పాన్ షాపులలో విచ్చలవిడిగా గంజాయి సేల్స్

 

రేవంత్ చెంచాగాళ్ల ట్రోల్స్ ఎక్కువైనయ్.. ఫిర్యాదు చేస్త