అపర ఏకాదశి మే 23.. ఉపవాసం ఉంటే అశ్వమేథయాగం చేసిన ఫలితం వస్తుంది..!

అపర ఏకాదశి మే 23.. ఉపవాసం ఉంటే అశ్వమేథయాగం చేసిన ఫలితం వస్తుంది..!

హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది.  ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి. ఈ విధంగా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని  అంటారు.ఈ ఏడాది  శుక్రవారం మే 22 వ తేదీ జరుపుకోనున్నారు.  అన్ని ఏకాదశులలో అపర ఏకాదశి అత్యంత పవిత్రమైనది.

హిందూమతంలో అపర ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.  వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. వ్రతం ఆచరిస్తే అశ్వమేథ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం పాపాలను నాశనం చేసేదిగా భావిస్తారు. అపర ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల మోక్షం లభిస్తుంది. 

హిందూమతంలో ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తి తన జీవితంలో సంపద, శ్రేయస్సును కాపాడుకుంటాడు. ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోనవసరం లేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. .అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. 

Also Read:-ఐదేళ్ల త‌ర్వాత కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర స్టార్ట్​.. ఎలా వెళ్లాలంటే..

అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి .. ఆధ్యాత్మిక చింతనతో గడిపితే  ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. అపర ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను పూజించి.. తులసి చెట్టును  పూజిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. అపర ఏకాదశి ఉపవాసం ఉండి ఆరాధించడం వల్ల అనేక పుణ్యాలు కలుగుతాయి.

అపర ఏకాదశి రోజు   ఉపవాసం ఉండటం వల్ల బ్రహ్మను చంపడం, దైవదూషణ, చెడు .. పనుల వంటి పాపాల నుండి విముక్తి పొందుతారు. అపర ఏకాదశి రోజున తులసి, గంధం, కర్పూరం, గంగా జలాలతో విష్ణుమూర్తిని పూజించాలని పండితులు చెబుతున్నారు. పద్మ పురాణం ప్రకారం ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన   కర్మ ఫలం వలన మరణానంతరం వచ్చే  బాధలకు  విముక్తి కలుగుతుంది.