పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

ఇటు సౌత్, అటు బాలీవుడ్‌‌లో ఇటీవల వరుస ప్రేమ వివాహాలు జరుగుతున్న క్రమంలో తమన్నా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ బిజినెస్‌‌ మ్యాన్‌‌ను తమన్నా పెళ్లి చేసుకోబోతోందని, సినిమాలు తగ్గించడానికి కారణం ఇదేనని గత వారం రోజులుగా చాలా వార్తలొచ్చాయి. ఈ పెళ్లి కబుర్లు తమన్నాకు కూడా చేరడంతో.. సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చిందామె. . ‘వ్యాపారవేత్త అయిన నా భర్తను పరిచయం చేస్తున్నాను.. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఉన్న ఆ బిజినెస్‌‌ మ్యాన్ మరెవరో కాదు.. ‘ఎఫ్‌‌ 3’ సినిమాలో కాసేపు మేల్‌‌ గెటప్‌‌లో నటించిన తమన్నానే. ఆ వీడియోకి ‘మ్యారేజ్ రూమర్స్‌‌... ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించిన స్క్రిప్ట్ రాస్తున్నారు’ అనే క్యాప్షన్స్ జోడించింది.

మొత్తానికి తన పెళ్లి వార్తలను ఖండించడమే కాక, తనపై గాసిప్స్ క్రియేట్ చేసిన వారికి ఇలా స్ట్రాంగ్‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చింది తమన్నా. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ప్రస్తుతం చిరంజీవికి జంటగా ‘భోళా శంకర్‌‌‌‌’లో నటిస్తోంది. సత్యదేవ్‌‌తో కలిసి నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ కావలసి ఉంది. హిందీ, మలయాళ భాషల్లోనూ ఆమె నటిస్తోంది.