బీమా రంగంలోకి అపోలో 24/7... త్వరలో 'హెల్త్- ఫస్ట్ క్రెడిట్ కార్డ్' విడుదల

బీమా రంగంలోకి అపోలో 24/7... త్వరలో 'హెల్త్- ఫస్ట్ క్రెడిట్ కార్డ్' విడుదల

హైదరాబాద్, వెలుగు: మనదేశంలో మరింత మందికి  నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యంతో బీమా రంగంలో అడుగు పెట్టామని అపోలో హెల్త్‌‌‌‌కో సీఈఓ మాధివనన్ బాలకృష్ణన్ అన్నారు. హైదరాబాద్​లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అపోలో హెల్త్‌‌‌‌కోకు చెందిన అపోలో 24/7 ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో కూడా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ‘‘ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌‌‌‌లు అందించడమే అపోలో 24/7 లక్ష్యం.  

రాబోయే రెండు నెలల్లో 12 కంపెనీల ఉత్పత్తులను ప్రారంభించాలని భావిస్తున్నాం. ప్రతి ప్లాన్ కూడా అపోలో ప్రత్యేక ప్రయోజనాలతో ఉంటుంది. భవిష్యత్‌‌‌‌లో ఓపీడీ (ఔట్‌‌‌‌పేషెంట్) కవరేజ్‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెడతాం. మొదటి ఏడాదిలో రూ.80 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. భారతదేశపు మొదటి ‘హెల్త్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్’ త్వరలో విడుదల కానుంది. 

ముందస్తు ఆరోగ్య పరీక్షలను ప్రోత్సహించేందుకు 'అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్' ప్రారంభించాం. తెలంగాణ మా డిజిటల్ హెల్త్‌‌‌‌కేర్ వ్యూహంలో కీలకం.  ఈ ప్రాంతవాసులకు టెక్నికల్​ నాలెడ్జ్​ ఉంది. ప్రతి ఒక్కరూ సరైన హెల్త్​పాలసీ తీసుకునేలా సాయపడతాం”అని ఆయన వివరించారు.