
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (ఏహెచ్‌ఈఎల్) తన అనుబంధ సంస్థ అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్)లోని 31 శాతం వాటాను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నుంచి రూ.1,254.07 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఏహెచ్‌ఈఎల్ బోర్డు సమావేశంలో, ఐఎఫ్‌సీ, ఐఎఫ్‌సీ ఈఏఎఫ్ కలిపి కలిగి ఉన్న 41.65 కోట్ల షేర్ల (30.58శాతం)ను కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించింది. ఈ కొనుగోలు పూర్తయిన తర్వాత ఏహెచ్‌ఎల్‌ఎల్ పూర్తిగా ఏహెచ్‌ఈఎల్‌కు చెందిన అనుబంధ సంస్థగా మారుతుంది. 99.42శాతం వాటా దక్కించుకుంటుంది.
ఏహెచ్‌ఎల్‌ఎల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం, డయాగ్నస్టిక్ సేవలతో సమగ్రత పెంచడం, ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ కొనుగోలు ముఖ్య ఉద్దేశం. ఇది షేర్‌హోల్డర్ల విలువను పెంచే స్ట్రాటజిక్ చర్య అని ఏహెచ్‌ఈఎల్ ఎండీ సునీతా రెడ్డి అన్నారు. గురుగ్రామ్‌లో రూ.573 కోట్ల ఆంకాలజి సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా అపోలో బోర్డు ఆమోదం తెలిపింది.