ఈ లింక్‌ ద్వారా ఇంట్లోనే ఉండి కరోనా రిస్క్ చెక్ చేసుకోండి

ఈ లింక్‌ ద్వారా ఇంట్లోనే ఉండి కరోనా రిస్క్ చెక్ చేసుకోండి

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు ఎక్కడ ఎవరిని కదిలించినా కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ మాత్రం జలుబు, కాస్త జ్వరంగా అనిపించినా భయపడిపోతున్నారు ప్రజలు. ఎక్కడ ఆ మహమ్మారి బారినపడతామో అని గుబులుగా ఉంటున్నారు. ఇప్పటి వరకు కరోనాను నివారించే వ్యాక్సిన్ లేకపోవడం.. ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో జనాల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అపోలో హాస్పిటల్స్ సెల్ఫ్ చెకింగ్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చాయి. కరోనా రిస్క్‌ను తమంతట తామే ఇంట్లో కూర్చుని అంచనా వేసుకునేలా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు డాక్టర్‌ని కలవాలా వద్దా? తమకు రిస్క్ తక్కువగా ఉందా? ఎక్కువగా ఉందా? అన్న విషయాలను తెలుసుకోవచ్చు. దీంతో మనసులో లేనిపోని భయాలకు తావులేకుండా పోతుంది.

కరోనా రిస్క్ చెక్ చేసుకోవడం ఇలా..

Apollo hospitals released a self Corona risk assessment test

– ఈ లింక్ https://bit.ly/2WylPf9 ని క్లిక్ చేయడం ద్వారా అపోలో 24/7 కరోనా వైరస్ రిస్క్ స్కాన్ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది.

– హోం పేజీలో మీ వయసు అడుగుతుంది.

– వయసు ఎంటర్ చేయగానే జెండర్ అడుగుతుంది.

– ఆ తర్వాత మీ శరీర ఉష్ణోగ్రత ఎంత (జ్వరం ఏమైనా ఉందా) అనే విషయాన్ని ఎంటర్ చేయాలి.

– దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బలహీనంగా అనిపించడం లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అన్న వివరాలు అడుగుతుంది.

– తర్వాతి స్టెప్‌లో ఇతర లక్షణాలను గురించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

– ట్రావెల్ హిస్టరీ, లక్షణాలు ఎక్కువ కావడం లాంటిదేమైనా ఉందా అన్న వివరాలను ఎంటర్ చేసి కన్ఫమ్ చేయగానే మీ రిస్క్ ఏ స్థాయిలో ఉందన్న దానితో పాటు పాటించాల్సిన జాగ్రత్తలు, సలహాలు కూడా డిస్‌ప్లే అవుతాయి.