పతంజలి తప్పుడు ప్రకటనలు : సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పిన రాందేవ్..

పతంజలి తప్పుడు ప్రకటనలు : సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పిన రాందేవ్..

ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ.. పతంజలి వస్తువుల్లో వ్యాధి, రోగ నిరోధక శక్తి ఉంటుందంటూ ప్రచారం చేసిన యోగాగురు రాందేవ్ బాబా.. సుప్రీంకోర్టులో భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆధునిక వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తూ.. పతంజలి ప్రాడక్ట్స్ ప్రకటనలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత.. రాందేవ్ కోర్టుకు హాజరుకావాలని లేకపోతే తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే 2024, ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టుకు హాజరయ్యారు రాందేవ్. దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను.. పతంజలి సరుకును మార్కెటింగ్ చేసే సమయంలో.. తప్పుడు ప్రకటనలు ఇచ్చినట్లు అంగీకరించారు రాందేవ్. కరోనా సమయంలో అల్లోపతి కంటే పతంజలి మందులు వాడితే కరోనా రాదు అన్నట్లు ఆయన ప్రచారం చేయటాన్ని తప్పుబట్టింది కోర్టు. పతంజలి ఉత్పత్తుల్లో వ్యాధులను నయం చేసేటువంటి మందులు లేవని అంగీకరిస్తూ.. సుప్రీంకోర్టులో రాందేవ్ బేషరతు క్షమాపణలు చెప్పారు.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం 1954 కింద.. రోగాలకు చికిత్స చేస్తామంటూ ప్రచారం చేస్తున్న అన్ని పతంజలి ఉత్పత్తుల అన్ని ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

సుప్రీం సీరియస్

పతంజలి డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను ఆయుర్వేదిక్ మందులు, యోగాతో  పూర్తిగా నయం చేస్తుందని అడ్వటైజింగ్ చేయడాన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తప్పుబట్టింది.  రామ్ దేవ్ బాబా మెడిసిన్ వాడకంపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని IMA  కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు  రామ్‌దేవ్‌పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 188, 269, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా క్యాంపెయిన్ నిర్వహించిందని ఆరోపిస్తూ IMA దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బెంచ్ విచారించింది. పతంజలి ఆయుర్వేదిక్ వ్యాధుల్ని  వెంటనే, పూర్తిగా నయం చేస్తుందని చేసిన యాడ్స్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఫిబ్రవరి 27 న ధిక్కార నోటీసులు పంపించింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకూ పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి యాడ్స్ ప్రకటించవద్దని  కోర్టు ఆదేశించింది. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో యాడ్స్ పబ్లిసిటీ చేసినందుకు పతంజలిపై చర్యలు తీసుకుంటామని  హెచ్చరించింది. మళ్లీ ఇవాళ విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టులో హాజరైన రాందేవ్ బాబా తన తప్పు ఒప్పుకుని బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. వివరణ ఇచ్చేందుకు పతంజలికి మరో ఛాన్స్ ఇస్తూ విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.