దేశ ప్రజలకు 'ఆదిపురుష్' టీం క్షమాపణలు చెప్పాలి.. శివసేన ఎంపీ డిమాండ్

దేశ ప్రజలకు 'ఆదిపురుష్' టీం క్షమాపణలు చెప్పాలి.. శివసేన ఎంపీ డిమాండ్

'ఆదిపురుష్' సినిమా ఇటీవలే విడుదల కాగా.. ఈ మూవీపై కొన్ని చోట్ల విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారని ఎంపీ ఈ సందర్భంగా ఆరోపించారు. అందుకు గానూ దేశ ప్రజలకు చిత్రబృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రియాంక పట్టుబట్టారు. వినోదం పేరుతో పూజించే దేవుళ్లకు భాషను ఆపాదించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఆమె..  పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటడం ఆమోదయోగ్యం కాదంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

https://twitter.com/priyankac19/status/1669916258429714434