
ఆదిలాబాద్ జిల్లా సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని డిసైడయ్యారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను నిన్న కుటుంబ సభ్యులు చెల్లించారు. రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్ కి ఇప్పటికే ఉరి శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.