హైకోర్టులో తేల్చుకోండి..రవిప్రకాష్ కు సుప్రీం ఆదేశం

హైకోర్టులో తేల్చుకోండి..రవిప్రకాష్ కు సుప్రీం ఆదేశం

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.  ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. జూన్ 10న మరోసారి ముందస్తు బెయిల్ పై హై కోర్ట్ విచారణ జరపాలని ఆదేశించింది.  41 ఏ కింద రవి ప్రకాష్ విచారణకు హాజరుకావలని ఆదేశించింది. రవిప్రకాష్ ను  అరెస్ట్ చేయాలనుకుంటే 48 గంటల ముందు  నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పింది సుప్రీం కోర్టు .

హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో రవిప్రకాష్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు సార్ల నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.