ప్రధాని మోడీతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ భేటీ

ప్రధాని మోడీతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ భేటీ

భారత పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత్‌లో వివిధ రంగాల్లో సాంకేతికత ప్రభావంతోపాటు దేశంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రధానితో చర్చించినట్లు వెల్లడించారు. ఈ భేటీపై ట్విటర్‌లో స్పందించిన ప్రధాని మోడీ.. వివిధ అంశాలతోపాటు భారత్‌లో సాంకేతిక పరంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఇద్దరం తమ అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు. 

‘ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. విద్యారంగం మొదలు అభివృద్ధి, తయారీ రంగంతోపాటు పర్యావరణం వరకు భారత భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. మేం దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ చెప్పారు. 

భారత్‌లో తొలి సొంత రిటైల్‌ స్టోర్‌ను యాపిల్‌ సంస్థ ఈ నెల 18న ప్రారంభించింది. ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో సంస్థ సీఈవో టిమ్‌కుక్‌ నేరుగా వినియోగదారులకు ఆహ్వానం పలికారు. దేశంలో రెండో విక్రయ కేంద్రాన్ని ఏప్రిల్‌ 20న డిల్లీలో టిమ్‌కుక్‌ ప్రారంభిస్తారు. అక్కడ కూడా ఆయనే నేరుగా కస్టమర్లకు స్వాగతం పలుకుతారు.

https://twitter.com/narendramodi/status/1648687204301152256