ఇకపై ‘హే సిరి’ అంటే పలకదు

ఇకపై ‘హే సిరి’ అంటే పలకదు

యాపిల్ కంపెనీ తన వాయిస్ కమాండర్ ‘సిరి’ని అప్ గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇదివరకు ‘హే సిరి’ అంటూ వాయిస్ అసిస్టెంట్ ని వాడేవాళ్లు యూజర్లు. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ అప్ డేట్ తో ‘హే’ని తీసేసి సింగిల్ పదం ‘సిరి’ మాత్రమే ఉండేలా అప్ డేట్ తీసుకురాబోతున్నట్టు బ్లూమ్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల వాయిస్ కమాండింగ్ సులువుగా మారే అవకాశం ఉందంటున్నారు. 

సింగిల్ వర్డ్ ‘సిరి’ ఆలోచన చిన్న మార్పే అయినా, దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. టెక్నికల్ గా యాపిల్ కి రెండేండ్లు పట్టవచ్చని చెప్తున్నారు. ఇందుకు యాపిల్ మాన్యుఫాక్చరింగ్ ఏఐ, ఇంటర్నల్ ఇంజనీరింగ్ ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ దగ్గర్నుంచి, థర్డ్ పార్టీ యాప్‌లను వాడటానికి సిరి వాయిస్ అసిస్టెంట్ ని ఉపయోగించుకోవచ్చు.

సిరి వర్డ్ ని అమేజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ లాగ సింగిల్ వర్డ్ లా ఉపయోగించుకోవచ్చు. యాపిల్ మొబైల్స్, బ్లూ టూత్ స్పీకర్లకి కూడా పనిచేస్తుంది. ఇంగ్లిష్ కాకుండా ఇతర భాషలకు సిరి ససోర్ట్ చేస్తుంది.