మూడేళ్లలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు

మూడేళ్లలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు

న్యూఢిల్లీ : యాపిల్ తన వెండర్లు, సప్లయర్ల ద్వారా వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల మందికి పైగా జాబ్స్ ఇస్తుందని అంచనా. ప్రస్తుతం 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. యాపిల్‌‌ కోసం రెండు ప్లాంట్లను నడుపుతున్న టాటా ఎలక్ట్రానిక్స్‌‌ ఎక్కువ మందికి జాబ్స్‌‌ ఇచ్చింది. ‘ఇండియాలో పెద్ద మొత్తంలో ఉద్యోగులను యాపిల్‌‌ నియమించుకుంటోంది.  రానున్న మూడేళ్లలో తన వెండర్లు, కాంపోనెంట్లను సప్లయ్ చేసే కంపెనీల ద్వారా ఐదు లక్షల మందికి పైగా జాబ్స్‌‌ ఇస్తుంది’ అని ప్రభుత్వ సీనియర్ అధికారి  ఒకరు పేర్కొన్నారు. 

ఈ స్మార్ట్‌‌ఫోన్ల తయారీ కంపెనీ దేశంలో తన ప్రొడక్షన్‌‌ను ఇంకో ఐదేళ్లలో  రూ.3.32 లక్షల కోట్లకు (40 బిలియన్ డాలర్లకు) అంటే ఐదు రెట్లు పెంచుకోవాలని చూస్తోందన్నారు. కౌంటర్‌‌‌‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, ఇండియాలో మిగిలిన ఫోన్ల తయారీ కంపెనీలతో పోలిస్తే  యాపిల్ రెవెన్యూ కిందటేడాది ఎక్కువగా ఉంది. వాల్యూమ్ పరంగా, శామ్‌‌సంగ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవ్వయ్యాయి. 2023–24 లో 12.1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఇండియా నుంచి ఎగుమతి అయ్యాయి. 2022–23 లో ఎగుమతైన 6.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 100 శాతం గ్రోత్‌‌కు సమానం.