ఐ ఫోన్లకు సైబర్ ఎటాక్ ముప్పు : అలర్ట్ చేసిన యాపిల్

ఐ ఫోన్లకు సైబర్ ఎటాక్ ముప్పు : అలర్ట్ చేసిన యాపిల్

మీరు ఐ ఫోన్ యూజర్లా.. అయితే కచ్చితంగా అప్రమత్తంగా ఉండండి.. ఈ మేం చెబుతున్నది కాదు.. యాపిల్ కంపెనీ మెయిల్ ద్వారా అలర్ట్ చేస్తుంది. యాపిల్ ఐఫోన్లలో స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను చొప్పించటానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారంటూ కస్టమర్లను హెచ్చరించింది యాపిల్ కంపెనీ.  భారత్‌ తో సహా ప్రపంచవ్యాప్తంగా 91 దేశాల్లోని యూజర్లకు ఈ ప్రమాదం పొంచి ఉన్నాయని  యాపిల్ పంపిన వార్నింగ్  నోటిఫికేషన్ చర్చనీయాంశంగా మారింది.   యాపిల్ నుండి ఎంతమందికి ఈ  నోటిఫికేషన్ వచ్చిందనేది ఖచ్చితంగా అయితే  తెలియదు.  NSO -గ్రూప్‌ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ వినియోగాన్ని ఇమెయిల్ హైలైట్ చేస్తుంది.

2024 ఏప్రిల్ 11 గురువారం రోజున ఉదయం 12:30 గంటలకు భారత్ లోని ఐఫోన్  యూజర్లకు ఈ  నోటిఫికేషన్ పంపింది.  గతేడాది అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు నేత శశి థరూర్ , ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు, మీడియా ప్రముఖులకు యాపిల్‌ పంపిన నోటిఫికేషన్‌ తీవ్ర చర్చకు దారితీసింది.  అధికారిక మద్దతు ఉన్న సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చని అందులో హెచ్చరించింది.

యాపిల్2021నుంచి ఈ బెదిరింపు నోటిఫికేషన్‌లను పంపడం ప్రారంభించింది . అప్పటి నుండి 150 దేశాల్లోని వ్యక్తులు వాటిని స్వీకరించారు. గత ఏడాది నోటిఫికేషన్ పంపినప్పుడు 20 మంది భారతీయులు ఐఫోన్‌లు కలిగి ఉన్నారు.  2021లో, ఇజ్రాయెలీ సంస్థ NSO గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అనధికార నిఘా ఆరోపణలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కొంతమంది కార్యకర్తలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించినట్లు ఆరోపించిన మీడియా నివేదికల నేపథ్యంలో పెగాసస్ వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఈ ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.