యాపిల్‌‌‌‌‌‌‌‌ కొత్త సీఓఓ సబీహ్ ఖాన్ మనోడే!

యాపిల్‌‌‌‌‌‌‌‌ కొత్త సీఓఓ సబీహ్ ఖాన్ మనోడే!

న్యూఢిల్లీ: గ్లోబల్​ టెక్​ కంపెనీ యాపిల్‌‌‌‌‌‌‌‌ భారత సంతతికి చెందిన సబీహ్​ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఓఓ) గా నియమించింది. 58 ఏళ్ల ఖాన్, యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలు అందిస్తున్నారు. జులై నెలాఖరులో జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు.

 ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మొరాదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1966లో జన్మించిన సబీహ్​ ఖాన్, స్కూలు విద్య కోసం సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి, ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలను,  రెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేలర్ పాలిటెక్నిక్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాస్టర్స్ డిగ్రీని సాధించారు. 

ఖాన్ 1995లో యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరడానికి ముందు, జీఈ ప్లాస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. యాపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరినప్పటి నుంచి అనేక కీలక పాత్రలు పోషించారు.  ప్రతి యాపిల్‌‌‌‌‌‌‌‌ వినూత్న ఉత్పత్తిని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందించడంలో ఖాన్​ కీలకమని యాపిల్‌‌‌‌‌‌‌‌​ ప్రశంసించింది.