
ఆపిల్ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తూ భారత్‌లో ఐఫోన్ తయారీని పెంచుతోంది. 2025 సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ మొత్తం 4 మోడళ్లు మొదటిసారిగా పూర్తిగా భారతదేశంలోనే తయారవ్వనున్నాయి. ఇది ఐఫోన్ తయారీ మీద చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, భారతదేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలపరచడానికి తీసుకున్న అతి పెద్ద నిర్ణయంగా తెలుస్తోంది.
దేశంలోని 5 ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని ఆపిల్ కొనసాగిస్తోంది. వాటిలో రెండు టాటా గ్రూప్ హోసూర్, ఫాక్స్‌కాన్ బెంగుళూరు ప్లాంట్లు ముఖ్యంగా ఉన్నాయి. టాటా గ్రూప్ భారతదేశ ఐఫోన్ తయారీలో దాదాపు అర్ధభాగం వాటాను వచ్చే రెండు సంవత్సరాల్లో అందుకునే ఆశయం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతదేశ ఐఫోన్ ఎగుమతులు 225.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరపు 147.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే అధికం. దీంతో ఆపిల్ గ్లోబల్ ఉత్పత్తిలో 20 శాతం ఇండియాలో కొనసాగుతోంది.
ప్రస్తుతం ఐఫోన్ల తయారీలో ఉపయోగించే ముఖ్యమైన మెషినరీ కూడా ఇండియాలోనే తయారీకి ఆపిల్ ప్లాన్ చేసింది. వాస్తవానికి చైనా ఈ మెషినరీ విషయంలో ఆంక్షలు అలాగే ఆలస్యాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న క్రమంలో ఆపిల్ దానిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి భారత కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటికే దాదాపు 35 కంపెనీలతో పనిచేస్తుండగా.. వాటిలో సగం కంపెనీలు ఆపిల్ కు మెషినరీ సప్లై స్టార్ట్ చేశాయి. ఈ మెషినరీలు స్మార్ట్‌ఫోన్ల పేరిట ఉండే సర్క్యూట్ బోర్డుల తయారీకి అవసరమైనవి. మెషినరీ తయారీ విషయంలో కూడా చైనా నుంచి ఆధారపడటం తగ్గించి, స్థానికంగా తయారీ చేయడంలో ఆపిల్ పెద్ద అడుగు వేసిందని తాజా చర్యలు చెబుతున్నాయి.
ALSO READ : బ్యాంకుల్లో మూలుగుతున్న క్లెయిమ్ చేయని రూ.67వేల కోట్లు.. RBI కీలక నిర్ణయం..
ఈ మార్పులు భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా ఎదుగుదల సాధించే చాన్సులు పెంచుతూ.. బాధ్యతాయుతమైన సరఫరా గొలుసు ఏర్పాటులో కీలకంగా మారనుంది. చైనా నుండి వస్తున్న సరఫరా అడ్డంకులని దాటేందుకు, స్థానికంగా మెషినరీ, భాగాల తయారీని పటిష్టం చేస్తున్న ఆపిల్.. భారతదేశంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని చైనా స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటి వరకు కేవలం ఐఫోన్ల తయారీకే పరిమితమైన భారత్ మెషినరీ తయారీలోకి రావటంతో డబుల్ బెనిఫిట్ పొందనుంది.