ఫిబ్రవరి 26 నుంచి ఎప్ సెట్(TS EAPCET) అప్లికేషన్లు

ఫిబ్రవరి 26 నుంచి ఎప్ సెట్(TS EAPCET) అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల26 నుంచి తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్​ ఎప్ సెట్) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దీన్ కుమార్ తెలిపారు. బుధవారం ఎప్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ఆయన చెప్పారు. పూర్తి వివరాలను  https://eapcet.tsche.ac.in  వెబ్ సైట్ లో పెడతామని వెల్లడించారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఆన్​లైన్ లో అప్లై చేసుకోవచ్చని వివరించారు.