
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టాలెంట్ఉన్న16 నుంచి 21 ఏండ్ల యువతకు 64 కేటగిరీల్లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ నిర్వహించనుంది. రాష్ర్టస్థాయి, దక్షిణాది రాష్ట్రాలు, నేషనల్, వరల్డ్ లెవెల్ లో ఈ పోటీలు జరగనున్నాయి.
ఈ ఏడాది జులైలో రిజిస్ర్టేషన్లు స్టార్ట్ కాగా ఈనెల 30తో అప్లికేషన్ కు గడువు ముగియనుంది. రాష్ర్ట వ్యాప్తంగా ఈ పోటీలకు 600 మంది అప్లై చేసినట్టు కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. నవంబర్ , డిసెంబర్ లో రాష్ర్ట స్థాయి, డిసెంబర్ , జనవరిలో దక్షిణాది రాష్ర్టాల స్థాయి, ఫిబ్రవరిలో జాతీయ స్థాయి, వచ్చే ఏడాది సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు ప్రపంచ స్థాయి పోటీలు చైనాలోని షాంఘైలో జరగనున్నాయి.
ఈ పోటీల్లో ప్రపంచ స్థాయి కంపెనీలు మహీంద్రా, టయోట, మారుతి సుజుకీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్, న్యాక్ భాగస్వామ్యం కానున్నాయి.