
ములుగు, వెలుగు : ములుగు జిల్లా జకారంలోని సమ్మక్క, సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో 2025– 26 సంవత్సరంలో యూజీ అడ్మిషన్లకు అప్లై చేసుకోవాలని వీసీ వైఎల్. శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ (హానర్స్), ఇంగ్లిష్, బీఏ (ఎకనామిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు ఉన్నాయన్నారు.
జూలై 23 నుంచి చే ప్రారంభమైన ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ఈ నెల 31తో ముగుస్తుందన్నారు. ఆగస్ట్ 4న టెంపరరీ మెరిట్ లిస్ట్, 6న ఫైనల్ లిస్ట్, కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఉంటుందన్నారు. 11న ఫిజికల్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని, 13న క్లాస్‌లు ప్రారంభం అవుతాయన్నారు. అర్హులైన వారంతా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.ssctu.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని వీసీ పేర్కొన్నారు.