
హైదరాబాద్, వెలుగు: దేవాలయాలకు, అర్చకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే దూప దీప నైవేద్యం స్కీమ్‌కు అప్లికేషన్లు షురూ అయ్యారు. గురువారం నుంచి ఈ నెల 25 వర కు గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న ఆలయాల వివరాలతో అప్లై చేయాలని ఆ శాఖ డైరెక్టర్ వెంకట్రావ్ గురువారం నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అప్లికేషన్లు www.endome nts.ts.nic.in వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. ఈ స్కీమ్ కింద దేవాలయాల నిర్వహణకు నెలకు రూ.4 వేలు, అర్చకులకు గౌరవ భత్యం కింద నెలకు రూ.6 వేలు ప్రభు త్వం ఇస్తోంది. అప్లికేషన్లను ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్, దేవాదాయ శాఖకు పంపాలన్నారు.