నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 9న ప్రారంభమై, ఏప్రిల్ 23న ముగుస్తుంది.
మొత్తం ఖాళీలు: 55.
విభాగాల వారీగా ఖాళీలు: జీడీఎంఓ 210, ఫిజీషియన్ (జనరల్ మెడిసిన్) 25, పీడియాట్రిక్స్ 01, ఆప్తమాలజీ 01, ఓ & జీ 08.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది నుంచి రెండేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 37 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 9.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు రూ.500.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ntpc.co.inను సందర్శించండి.
