కనుబొమలకు కలబంద

కనుబొమలకు కలబంద

చాలామంది డిఫరెంట్ ఐబ్రో షేప్స్​ ట్రై చేయాలనుకుంటారు. కానీ.. ఐబ్రో పల్చగా ఉండటంతో ప్రయోగాల జోలికి వెళ్లరు. అలాంటి వాళ్లు ఈ టిప్స్​ ఫాలో అయితే ఒత్తైన ఐబ్రో సొంతం చేసుకోవచ్చు.

  • వారానికోసారి కలబంద గుజ్జుని ఐబ్రోకి రాసి, ఆరాక కడిగితే ఆరోగ్యంగా పెరుగుతాయి. కలబంద గుజ్జులోని అలోయెనిన్, కెరోటిన్​ ఐబ్రో పెరుగుదలకి సాయపడుతుంది. 
  • ఐబ్రోకి కండీషనర్​గా, మాయిశ్చరైజర్​గా కొబ్బరినూనె పనిచేస్తుంది. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్​–ఈ, ఐరన్​, కనుబొమలు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్​ ఏజెంట్స్​​ ఐబ్రో కుదుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
  • నిమ్మ పొట్టుని ముప్పావు కప్పు కొబ్బరి నూనెలో పదిహేను రోజులు నానబెట్టాలి. ఆ మిశ్రమంలో  దూది ముంచి ఐబ్రోకి పట్టించినా ఫలితం ఉంటుంది. నిమ్మరసంలోని విటమిన్​–సి, బి, ఫోలిక్​ యాసిడ్​ ఐబ్రో త్వరగా పెరిగేలా చేస్తాయి. అయితే ఈ రెమిడీ సెన్సిటివ్​ స్కిన్​ వాళ్లకి అంతగా పడదు.
  • రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదంతో ఐబ్రోని మర్దనా చేస్తే  అందంగా ఉంటాయి. ఆముదంలోని  మినరల్స్​​, ఫ్యాటీ యాసిడ్స్​, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఐబ్రోని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.