నార్త్​ సెంట్రల్​ రైల్వేలో అప్రెంటిస్

నార్త్​ సెంట్రల్​ రైల్వేలో అప్రెంటిస్

ప్రయాగ్‌‌రాజ్‌‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌‌మెంట్‌‌ సెల్‌‌(ఆర్​ఆర్​సీ), నార్త్‌‌ సెంట్రల్‌‌ రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌‌ ద్వారా 1664 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్​ చేస్తారు.

మొత్తం ఖాళీలు: 1664
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్‌‌ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. 
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌‌సీవీటీ/ఎస్‌‌సీవీటీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్​ పోస్టులకు అర్హులు.
వయసు: 1 డిసెంబర్​ 2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్​ సెలెక్షన్​ చేస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్​ ప్రారంభం: 2 నవంబర్
చివరి తేది: 1 డిసెంబర్‌‌
వెబ్‌‌సైట్‌‌: www.rrcpryj.org