ఏపీలో 897 గ్రూప్‌‌-2 ఉద్యోగాలు

ఏపీలో 897 గ్రూప్‌‌-2 ఉద్యోగాలు

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌‌-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌‌ వెల్లడించింది. డిసెంబర్‌‌ 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  నోటిఫికేషన్‌‌లో 331 ఎగ్జిక్యూటివ్‌‌, 566 నాన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఖాళీలు ఉన్నాయి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్: ప్రిలిమ్స్‌‌ ఆబ్జెక్టివ్‌‌ తరహాలో ఆఫ్‌‌లైన్‌‌ విధానంలో ఉంటుంది. జనరల్‌‌ స్టడీస్, మెంటల్‌‌ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్‌‌ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్‌‌ షీట్‌‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌‌లో పేపర్‌‌-1, పేపర్‌‌-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్‌‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్​ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్​ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.psc.ap.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

81 గ్రూప్-1 పోస్టులు 

ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 81 గ్రూప్‌‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ ప్రకటన జారీ చేసింది. మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌‌ వెల్లడించింది. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 21 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.గ్రూప్‌‌-1 ప్రాథమిక పరీక్షను ఆబ్జెక్టివ్‌‌ పద్ధతిలో మార్చి 17వ తేదీన ఆఫ్‌‌లైన్‌‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్‌‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.