గోల్డ్ రేట్ అప్డేట్స్.. హైదరాబాద్‎లో ఇవాళ (ఏప్రిల్ 26) తులం బంగారం ధర ఎంతంటే..?

గోల్డ్ రేట్ అప్డేట్స్.. హైదరాబాద్‎లో ఇవాళ (ఏప్రిల్ 26) తులం బంగారం ధర ఎంతంటే..?

న్యూఢిల్లీ: రికార్డ్ స్థాయిలో లక్ష రూపాయల మార్క్ రీచ్ అయిన బంగారం ధరలు గత రెండు రోజులుగా డౌన్‎ఫాల్ అవుతున్నాయి. చైనా-అమెరికా ట్రేడ్ వార్, ఇతర అంతర్జాతీయ కారణాలతో గోల్డ్ రేట్ రికార్డ్ గరిష్టాలకు చేరింది. అయితే.. యూఎస్-డ్రాగన్ కంట్రీ మధ్య టారిఫ్ వార్ కాస్తా తగ్గుముఖం పడుతుండటంతో పాటు.. ధరలు ఆకాశనంటడంతో ప్రజలు కొనేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. 

లక్ష రూపాయలకు రీచ్ అయిన తర్వాత గోల్డ్ ధరలు మళ్లీ డౌన్ అవుతున్నాయి. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు వరుసగా పతనమైన పసిడి రేట్.. శనివారం (ఏప్రిల్ 26) మాత్రం స్థిరంగా ఉంది. శనివారం (ఏప్రిల్ 26) స్పాట్ మార్కెట్ చూస్తే.. హైదరాబాద్‌‌‌‌లో 24- క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,240, 22-క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 90,050గా ఉంది. వెండి ధర కేజీకి రూ.1,10,900 పలుకుతోంది. 
  
కాగా, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, యూఎస్ మాంద్యం భయాల మధ్య గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ రేటు మంగళవారం రూ. 1 లక్ష మార్కును కూడా దాటింది. అయితే.. డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్‌లను సడలిస్తానని ప్రకటించడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో గోల్డ్ ధరలు గత మూడు రోజులుగా డౌన్ ఫాల్ అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. లాంగ్‌‌‌‌ టెర్మ్‌‌‌‌లో మాత్రం ధరలు పెరుగుతాయని.. సో రేట్లు తగ్గినప్పుడే కొనుక్కునేందుకు మంచి అవకాశమని సూచించారు.