డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..15 మందికి గాయాలు

డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..15 మందికి గాయాలు

మహబూబ్ నగర్ జిల్లాలో  రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి దగ్గర డీసీఎం వ్యానును  ఢీకొట్టింది ఏపీ ఆర్టీసీ బస్సు. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణీకులు కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనలో డ్రైవర్ తో పాటు 15మందికి గాయాలయ్యాయి. 

వారిని వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి..చికిత్స అందిస్తున్నారు.  హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరంకు వెళ్తుండగా బురెడ్డిపల్లి దగ్గర జాతీయ రహాదారి -44పై యాక్సిడెంట్ జరిగింది. ఘటనలో ఆర్టీసీ బస్సు పూర్తి దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణీకులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.