శివ కార్తికేయతో సినిమానా.. లేక.. గజినీ సీక్వెలా?

శివ కార్తికేయతో సినిమానా..  లేక.. గజినీ సీక్వెలా?

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురుగదాస్(AR Murugadas) కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ దర్శకుడు చేసిన చివరి రెండు సినిమాలి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రావడంలేదట. గజినీ(Gajini), కత్తి(Kathi),తుపాకీ(Thupaki) వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన మురుగదాస్ కు ఇలాంటి పరిస్థితా అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.

అందుకే ఈ డైరెక్టర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ తన బ్లాక్ బస్టర్ మూవీ గజినీకి సీక్వెల్(Gajini sequel) ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. మురుగుదాస్ తన తరువాతి సినిమాను తమిళ హీరో శివ కార్తికేయ(Shiva karthikeya)తో ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 

ఈ న్యూస్ తెలుసుకున్న శివ కార్తికేయ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట. ప్రస్తుతం శివ కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించి పనిలో ఉన్నాడట శివ కార్తికేయ. అయితే శివ కార్తికేయ మురుగదాస్ తో చేసే సినిమా గజినీ సినిమాకు సీక్వెల్ గా వస్తుందా లేక.. కొత్త కాన్సెప్ట్ తో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.   మరి ఈ సినిమాతో అయినా మురుగదాస్ హిట్ కొడతాడా అనేది చూడాలి.